ఆలయంలో ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో బుధవారం ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. దేవాలయ పాలకవర్గం వారి ఆధ్వర్యంలో అర్చకస్వాములచే స్వామి మూలవిరాట్‌లకు విశేష పూజలు, ప్రత్యేక అలంకరణలు జరిగాయి. తెల్లవారు జామునుంచే భక్తులు స్వామి దర్శనానికి బారులు దీరారు. స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సంవత్సరం తమ జీవితాలు సుఖసంతోషాలతో ఉండాలని, దేశం సుభిక్షంగా ఉండాలని స్వామిని కోరారు. సాయంత్రం ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డాక్టర్ కె.వి. శ్రీరంగనాయకిచే తిరుప్పావై పై ఆధ్యాత్మిక ప్రవచనం అనంతరం గాయనీమణులు జరీనా, పరమేశ్వరి బృందం తమ గాత్రధారణలో పలు భక్తిగీతాలను శ్రావ్యంగా ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ధార్మిక ప్రాంగణంలో స్వాములకు సద్ధి కార్యక్రమం, చండీహోమం జరిగాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి