సందేశాత్మకంగా ‘చంచల’ నాటిక
‘గుంటూరు తిరుమల’ బృందావన్ గార్డెన్స్
శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై శుక్రవారం రాత్రి
ప్రదర్శితమైన చంచల నాటిక సందేశాత్మకంగా సాగింది. జస్ట్ స్మయిల్ (తిరుపతి) నిర్వాహకుడు
నీలం సుందరరావు ఆధ్వర్యంలో లక్ష్మీకులశేఖర్ రచనకు.. డాక్టర్ జలదంకి రవీంద్ర
దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు నీలం సుందరరావు అధ్యక్షత వహించారు.
రంగస్థల ప్రముఖులు సీఎన్ మూర్తి, నాయుడు గోపి, పి.శివప్రసాద్, నుసుము నాగభూషణం, రాయిపాటి ఆశీర్వాదం,
ఐ.
నరసింహం, ఆర్. ప్రసాద్, ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, డాక్టర్ జె.రవీంద్ర ప్రసంగించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి