ఆకట్టుకున్న డాక్టర్ వై. రమాప్రభ దీక్షితార్ కృతి మీమాంస - సోదాహరణాత్మక
కచేరి
‘గుంటూరు తిరుమల’ స్థానిక బృందావన్ గార్డెన్స్
శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై శనివారం గాయత్రిమహిళా సంగీత
సన్మండలి అధ్యక్షులు డాక్టర్ పి. విజయ ప్రధాన కార్యదర్శి ఏం. వై. శేషురాణి ల
ఆధ్వర్యంలో ముత్తుస్వామి దీక్షితుల వారి ఆరాధనా సంగీత మహోత్సవం జరిగింది. ఈ
సందర్బంగా జరిగిన సభా కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విశ్రాంత లెక్చరర్, గవర్నమెంట్ కాలేజీ అఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ , సంగీత బ్రహ్మ కే.వీ. బ్రహ్మానందం విజయవాడ వారు
పాల్గొన్నారు. కార్యక్రమాలను రేడియోలజిస్ట్ డాక్టర్ సుజాత, అతిధులు పాలకమండలి వారు జ్యోతి
ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం డాక్టర్ వై. రమాప్రభ దీక్షితార్ కృతి మీమాంస - సోదాహరణాత్మక సంగీత కచేరి జరిగింది.
అనేక ముత్తుస్వామి దీక్షితార్ కృతులకు సోదాహరణాత్మక వివరణ ఇస్తూ శ్రావ్యంగా గానం
చేశారు. వీరికి వయోలిన్ పై యెన్.వీ.ఎస్.ఎల్. ప్రసన్న, విశాఖ పట్నం, మృదంగంపై బీరక సురేష్‌బాబు, గుంటూరు, మోర్సింగ్ పై
టి.లక్ష్మిశంకర్ ఏలూరు వారు చక్కటి సహకారాన్ని అందించారు అనంతరం ఉపాధ్యక్షులు డాక్టర్.
రాజరాజేశ్వరి, , పి.లలిత దేవి, కార్యదర్శి ఎ.మంగా దేవి, ఉప కార్యదర్శి ఎం. మాధవీ కృష్ణల
ఆధ్వర్యంలో కళాకారులను అతిధులను ఘనంగా సత్కరించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి