శ్రీమద్భగవద్గీత పై ఆధ్యాత్మిక ప్రవచనం
‘గుంటూరు తిరుమల’ స్థానిక బృందావన్‌గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై కాకరపర్తి వెంకటనారాయణరావు, ప్రమీలాదేవి దంపతుల సౌజన్యంతో సోమవారం శ్రీమద్ భగవద్గీతలోని 11వ అధ్యాయం విశ్వరూపసందర్శనయోగః పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్మయ మిషన్ బ్రహ్మచారి సువీరానంద స్వామి ప్రవచిస్తూ అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో పరమగోప్యమైన ఆధ్యాత్మిక విషయములను ఉపదేశించారన్నారు. దాని వలన నా అజ్ఞానము తొలగిపోయిందన్నారు. శాశ్వతమైన నీ మహిమలను గూర్చి విన్నాను, నీవు చెప్పినదంతయు సత్యమేనన్నారు. కాని జ్ఞాన, ఐశ్వర్య, శక్తి, బల వీర్య, తేజోమహితమైన నీ షడ్గుణైశ్వర్య సంపన్న రూపమును ప్రత్యక్షముగా తెలుసుకొనుటకు సిద్ధంగా ఉన్నానని వాటి గూర్చి సవివరంగా తెలుపమన్నారని భగవత్ భక్తులకు తెలియజేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి