పత్రిజీ స్మారక సేవా పురస్కారాలు ప్రదానం
‘గుంటూరు తిరుమల’ స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై విశ్వభారతి కూచిపూడి ఆర్ట్ అకాడమి ఆధ్వర్యంలో 17.11.2024 ఆదివారం సాయంత్రం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి స్మారక సేవా పురస్కారాల సభ నిర్వహించారు. వ్యవస్థాపక అధ్యక్షులు నాట్యచార్య మట్టుపల్లి కాశీవిశ్వనాథ్ అధ్యక్షత వహించి, మాట్లాడారు. ముఖ్యఅతిథి ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి సేవా పురస్కారాలు అందజేయడం అభినందనీయమని అన్నారు. అనంతరం శ్రీసాయి మంజీర కూచిపూడి ఆర్ట్ అకాడమి నిర్వాహకులు కాజా వెంకట సుబ్రహ్మణ్యం, కళారత్న, గాన కళానిధి మోదుమూడి సుధాకర్, అంజనా, వైద్యులు గుంటూరు వరుణ్, ఆచార్యులు పెచ్చెట్టి వరప్రసాదమూర్తి, వసుదైక ఫౌండేషన్ చైర్మన్ నాగేంద్రం పేరం, నృత్యాంజలి మ్యూజిక్, డాన్స్ అకాడమి నిర్వాహాకులు(కాకినాడ) హరి లోకేషశర్మను పురస్కారాలతో సత్కరించారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి