వైభవంగా జ్వాలాతోరణం, చండీహోమం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రాంగణంలోని యాగశాలలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని అశేష భక్తి ప్రపత్తుల నడుమ జ్వాలాతోరణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. అనంతరం గణపతి హోమం, చండీ హోమం, రుద్ర యాగ క్రతువులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా ఆర్ష విద్యా కేంద్రం, సరస్వతి సేవా ట్రస్ట్ శ్రీశ్రీశ్రీ బ్రహ్మ నిష్టానంద సరస్వతి స్వామి, మాత జ్ఞానానంద పాల్గొని కార్యక్రమాలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ పాలకమండలి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, కార్యదర్శి బొర్రా ఉమాహేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి పుట్టగుంట ప్రభాకరరావు, సూర్యదేవర వెంకటేశ్వరరావు, నూతలపాటి తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాధవస్వామి బృందం ఆధ్వర్యంలో దీపోత్సవం కనుల పండువగా జరిగింది. తొలుత ఆలయ కమిటి ఉపాధ్యక్షులు లంకా విజయబాబు దీపాలను వెలిగించి ప్రారంభించారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని స్వామి వారి నామం, శంకం, చక్రాలకు దీపాలను వెలిగించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి