ఆముక్తమాల్యద – మాలదాసరి వృత్తాంతంపై ప్రవచనం
స్థానిక బృందావన్‌గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై సోమవారం సాయంత్రం తిరుప్పావై అమృతవర్షిణి డాక్టర్ కోగంటి వేంకట శ్రీరంగనాయకి గారిచే ఆముక్తమాల్యద – మాలదాసరి వృత్తాంతంపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ ఉపాధ్యక్షులు లంకా విజయబాబు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ కోగంటి వేంకట శ్రీరంగనాయకి గారు ప్రవచిస్తూ దాసరి తాను త్వరలో తిరుక్కురుంగుడి స్వామి ఆలయం దగ్గరకు పోయి తిరిగి రాని పక్షంలో విష్ణువును ఇతర దేవతలతో పోల్చి చెప్పేవాడు పోయే నరకానికి పోతాను అన్నారని బ్రహ్మ రాక్షసుడి దగ్గర ప్రమాణం చేశాడన్నారు. ఆ రాక్షసుడు ఇప్పటికే చేసిన పాపానికి ఇన్ని వేల సంవత్సరాల పిశాచ బాధ పడుతున్నాడన్నారు. అతని మాట కాదంటే విష్ణు పారమ్యం అంగీకరించని మహా పాపానికి ఇంకెన్ని మన్వంతరాలు ఇంకా భయంకర దుర్భర బాధలు అనుభవించాలో అని ఆ భయానికి ఆ దాసరిని విడిచి పెడ్తాడన్నారు. ఆతడు మాట మీద నిలిచి ప్రాణాలు లెక్క చేయక రావడం చూచి, అత్యంత భక్తి ఆతని మీద ప్రదర్శించి, ఆయన అనుగ్రహ వాక్కు వల్ల తన పాపాల నుంచి నిష్కృతి పొందుతాడు ఆ బ్రహ్మ రాక్షసుడు అన్నారని శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యాద గ్రంథం ద్వారా అందించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి