కల్యాణ్ కౌశిక్ వాయులీన కచేరీ
నాగార్జున కల్చరల్ సెంటర్, మ్యూజిక్ కాలేజ్ సంయుక్త నిర్వహణలో బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఆదివారం రాత్రి ఎన్సీ. కల్యాణ్ కౌశిక్, కె. సుబ్రహ్మణ్యేశ్వరరాజు వాయులీన కచేరీ చేశారు. కచేరీలో పలు వాగ్గేయకారుల కృతులు, కీర్తనలు ఆలపించారు. అనంతరం జరిగిన సభలో డాక్టర్ సుమితా శంకర్ పాల్గొని కళాకారులను సత్కరించారు. కార్యక్రమానికి నాగార్జున కల్చరల్ సెంటర్, మ్యూజిక్ కాలేజ్ చైర్మన్ వి.జె. వినయ్కుమార్ అధ్యక్షత వహించారు. సంస్థ కార్యదర్శి పి.ఎస్.ఎన్. మూర్తి, ప్రధాన కార్యదర్శి కె. సూర్యనారాయణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి