వైభవంగా స్వామివారికి పంచామృతాభిషేకం – కనుల పండువగా శ్రీపుష్పయాగం
‘గుంటూరు తిరుమల’ స్థానిక బృందావన్‌గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో ఆలయ
పాలకమండలి వారి ఆధ్వర్యంలో స్వామివారి తిరునక్షత్రం సందర్భంగా విశేషంగా ఉదయం
పంచామృతాభిషేకం, సాయంత్రం తీగల రవీంద్రబాబు, డాక్టర్ నాగేశ్వరమ్మ దంపతులు వారి
కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకస్వాములు మాధవస్వామి బృందం పుష్పాభిషేకం
నిర్వహించారు. పుష్పాభిషేకంలో అనేక రకాల పుష్పాలు, సుగంధద్రవ్యాలు, స్వామి వారికి
విశేషంగా ప్రియమైన తులసీ దళాలతో కనుల పండువగా శ్రీపుష్పయాగం నిర్వహించారు.
అత్యధికంగా పాల్గొన్న భక్తులు స్వామివారిని సేవించుకొని తీర్థప్రసాదాలను
స్వీకరించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి