సిరుల కల్పవల్లీ వందనం శరన్నవరాత్రుల్లో భాగంగా శుక్రవారం నగరంలోని పలు దేవాలయాల్లో మహాలక్ష్మిగా జగన్మాతను అలంకరించారు. చిరునవ్వుల సుందర రూపంతో అలరారుతూ అమ్మ భక్తులకు దర్శనమిచ్చింది. శుక్రవారం కూడా కలిసి రావడంతో లక్ష్మీదేవికి పూజలు మరింతగా జరిగాయి.
నృత్యోత్సవాలు ప్రారంభం
‘గుంటూరు తిరుమల’ బృందావన్
గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై 15.11.2024 గురువారం రాత్రి
శ్రీసాయి మంజీర కూచిపూడి. ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో కాజ సత్యవతీ దేవి
లక్ష్మీనరసింహారావు స్మారక బాల కళావేదిక 12వ చిల్డ్రన్ డాన్స్
ఒలింపియాడ్ ప్రారంభమైంది. ఆలయ పాలక మండలి అధ్య క్షుడు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు జ్యోతి వెలిగించి కార్యక్రమాలు
ప్రారంభించారు. ఈ సందర్భంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణని సత్క రించారు.
కాజ వెంకట సుబ్ర హ్మణ్యం తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి