సిరుల కల్పవల్లీ వందనం శరన్నవరాత్రుల్లో భాగంగా శుక్రవారం నగరంలోని పలు దేవాలయాల్లో మహాలక్ష్మిగా జగన్మాతను అలంకరించారు. చిరునవ్వుల సుందర రూపంతో అలరారుతూ అమ్మ భక్తులకు దర్శనమిచ్చింది. శుక్రవారం కూడా కలిసి రావడంతో లక్ష్మీదేవికి పూజలు మరింతగా జరిగాయి.
‘గుంటూరు తిరుమల’ బృందావన్‌గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం పద్మావతి కళ్యాణవేదికపై సోమవారం అమ్మవారు శ్రీగాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా అన్నమయ్య కళావేదికగా యం.వి. రత్తయ్య, సుజాత గార్ల ఆధ్వర్యంలో వీరబ్రహ్మేంద్ర భజన సమాజం, పెదవడ్లపూడి బృందం భక్తిగీతాలాపన జరిగింది. స్వామివారి, అమ్మవార్ల కీర్తనలను చక్కగా గానం చేశారు. సత్సంగ సభ్యులచే లలితా సహస్రనామ పారాయణ నిర్వహించారు.
కామెంట్‌లు
కామెంట్ను పోస్ట్ చేయండి