భక్తిశ్రద్ధలతో చండీ హోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణం లో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో పౌర్ణమి, దత్త జయంతి సందర్భంగా గురు వారం చండీ హోమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులు తొమ్మిది మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవ గ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. కాంటినెంటల్ కాఫీ అధినేత చల్లా రాజేంద్రప్రసాద్, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య పాల్గొన్నారు.
‘గుంటూరు తిరుమల’ బృందావన్‌గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం పద్మావతి కళ్యాణవేదికపై శనివారం ఉదయం అమ్మవారు శ్రీ కామాక్షీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా అన్నమయ్య కళావేదికగా యిమ్మడి అంజనీదేవి బృందం భక్తిమాల కార్యక్రమంలో అమ్మవారిపై అనేక కీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు. వీరికి వయోలిన్‌పై పాలపర్తి ఆంజనేయులు, తబలపై బాలాజి చక్కటి వాయిద్య సహకారం అందించారు. తొలుత ఆలయ పాలకమండలి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.






కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి