‘గుంటూరు తిరుమల’ స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం శ్రీ పద్మావతి కళ్యాణవేదికపై 11.10.2024 శఉక్రవారం 9వ రోజు అమ్మవారు మహర్నవమి సందర్భంగా శ్రీ మహిషాసుర మర్ధినీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. సత్సంగ సభ్యులచే ఉదయం సాయంత్రం లలితా సహస్రనామ పారాయణ నిర్వహించారు.
భక్తిశ్రద్ధలతో చండీహోమం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణంలో భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతుల ఆధ్వర్యంలో శరన్నవరాత్రుల మహోత్సవములలో భాగంగా 11.10.2024 మహర్నవమి పురస్కరించుకొని శుక్రవారం విశ్వశాంతిని కాంక్షిస్తూ చండీహోమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. 9మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, చండీ, రుద్ర హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. కార్యక్రమంలో ఏ.పి. సి.ఐ.డి. డిపార్ట్‌మెంట్ ఈశ్వరన్ దంపతులు, ఆలయ కమిటి అధ్యక్షుడు సిహెచ్. మస్తానయ్య, కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి