‘గుంటూరు తిరుమల’ బృందావన్‌గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం శ్రీ దేవి శరన్నవరాతులలో భాగంగా 10.10.2024 గురువారం శ్రీ దుర్గాదేవి (దుర్గాష్టమి) అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో ముత్తయిదువులు అమ్మవారికి కుంకుమపూజలు చేసి అమ్మవారి ఆశీస్సులను పొందారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా అన్నమయ్య కళావేదికపై మల్లాది కైలాసనాథ్ గారిచే అమ్మవారి వైభవంపై ప్రవచన చేశారు. తొలుత ఆలయ పాలకమండలి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సభ్యులు కన్నెగంటి బుచ్చయ్యచౌదరి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పద్మావతి కళ్యాణవేదికపై సత్సంగ సభ్యులచే లలితా సహస్రనామ పారాయణ నిర్వహించారు.
తెలుగువారు గర్వించదగ్గ సాహితీ పరిశోధకులు ఆచార్య గంగప్ప ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు భాష విభాగాధిపతిగా పనిచేసిన సందర్భంలో తన శిష్యరికంలో వేలాదిమంది విద్యార్థులను తీర్చిదిద్దటంతో పాటు 25 మంది పిహెచ్డీలు 25 మంది ఎంఫిల్డ్ పట్టాలు సాధించటంతో పాటు శతాధిక గ్రంథకర్తగా, పరిశోధకుడిగా, మార్గదర్శకుడుగా ప్రఖ్యాతిగాంచిన ఆచార్య గంగప్ప రాష్ట్రం గర్వించదగ్గ గొప్ప సాహిత్య కృషివలుడని ముఖ్యఅతిథిగా పాల్గొన్న కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ ఇ.వి నారాయణ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అన్నమయ్య కళావేదికపై ఆచార్య గంగప్ప స్మారక సాహిత్య పురస్కార కమిటీ ఆధ్వర్యంలో "ఆచార్య గంగప్ప 28వ సాహితీ పురస్కారం 2024" ప్రముఖ సాహిత్య వేత్త, అనువాద రచయిత డాక్టర్ తుర్లపాటి రాజేశ్వరి దేవి కి అందజేసి ఘనంగా సత్కరించి నగదు పురస్కారం అందజేశారు. సభకు డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు అధ్యక్షతగా దేవస్థానం అధ్యక్షులు చిటిపోతు మస్తానయ్య జ్యోతి ప్రజ్వలన గావించారు. కార్యక్రమంలో ఆచార్య జీవి చలం, డాక్టర్ గుమ్మా సాంబశివరావు, డాక్టర్ వెన్నిశెట్ట...
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి