సిరుల కల్పవల్లీ వందనం శరన్నవరాత్రుల్లో భాగంగా శుక్రవారం నగరంలోని పలు దేవాలయాల్లో మహాలక్ష్మిగా జగన్మాతను అలంకరించారు. చిరునవ్వుల సుందర రూపంతో అలరారుతూ అమ్మ భక్తులకు దర్శనమిచ్చింది. శుక్రవారం కూడా కలిసి రావడంతో లక్ష్మీదేవికి పూజలు మరింతగా జరిగాయి.
‘గుంటూరు తిరుమల’ బృందావన్‌గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం శ్రీ దేవి శరన్నవరాతులలో భాగంగా 09.10.2024 బుధవారం సరస్వతీదేవి (మూలా నక్షత్రం) అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో విద్యార్ధినీ విద్యార్ధుల పాల్గొని సరస్వతీదేవి పూజలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులను పొందారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా అన్నమయ్య కళావేదికపై శ్రీమతి కొండపి వసుంధర గారిచే అన్నమాచార్యుల సంకీర్తనల గానం వీనువిందుగా సాగింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి