‘గుంటూరు తిరుమల’ బృందావన్‌గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం పద్మావతి కళ్యాణవేదికపై 08.10.2024 మంగళవారం అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా అన్నమయ్య కళావేదికగా శ్రీ భాగి నారాయణశాస్త్రి అండ్ పార్టీ, శ్రీ వాణీ కళానికేతన్, హైదరాబాద్ శాఖ వారిచే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే! 940వ భక్తి గీతమాలిక కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ పాలకమండలి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. భాగి నారాయణ శాస్త్రి అమ్మవారిని స్తుతిస్తూ అనేక భక్తి కీర్తనలను, అన్నమయ్య సంకీర్తనలను మధురంగా గానం చేసి ఆహుతులను అలరించారు. కార్యక్రమం అనంతరం ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య భాగి నారాయణ శాస్త్రి గారిని సత్కరించారు.
ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై శనివారం కూచిపూడి నృత్యప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలుత నూజివీడు సీడ్స్ చైర్మన్ కారుమంచి ప్రసాద్, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కుమారి చదలవాడ వేంకట రమణి, నాట్యకిరణం కూడిపూడి నృత్య అకాడమి హైదరాబాద్ నాట్యాచారిణి మిద్దె కిరణ్మయి మరియు బృందం కూచిపూడి నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని కీ.శే. శ్రీమతి చదలవాడ శారద సత్యనారాయణ జ్ఞాపకార్ధం కార్యక్రమాన్ని చదలవాడ వేంకట రమణి నిర్వహించారు.










కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి