‘గుంటూరు తిరుమల’ బృందావన్‌గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం పద్మావతి కళ్యాణవేదికపై 07.10.2024 సోమవారం శ్రీ భవానీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా అన్నమయ్య కళావేదికగా బ్రహ్మశ్రీ కైలాసనాధ్ గారిచే దేవీ నవరాత్ర వైభవము ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ పాలకమండలి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మల్లాది కైలాసనాధ్ ప్రవచిస్తూ చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతముగా మనము ఈ విజయదశమి పండుగను జరుపుకుంటామన్నారు. అమ్మవారు అనేక రూపాలలో అనేకమంది రాక్షసులను సంహరించి, దుష్టశిక్షణ చేసి లోకాలను కాపాడారన్నారు. స్త్రీ తక్కువ కాదని, ఆమెను గౌరవించాలని ఈ పండుగ మనకు సందేశాన్ని అందిస్తుందని తెలియజేశారు. పద్మావతి కళ్యాణవేదికపై సత్సంగ సభ్యులచే లలితా సహస్రనామ పారాయణ నిర్వహించారు.
ఘనంగా గురువులకు సత్కారం గుంటూరు బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వర దేవాలయం అన్నమయ్య కళావేదికపై సోమవారం గురువులకు చిరు సత్కార కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభా కార్యక్రమంలో విశ్వపావని సభాధ్యక్షులుగా వ్యవహించారు. అతిథులుగా డాక్టర్ కోగంటి వేంకటశ్రీరంగనాయకి, బెండపూడి లక్ష్మీకుమారి, డాక్టర్ గిరిజాశేషమాంబ, పాటిబండ్ల జానకి, పసుమర్తి పద్మజకుమారి పాల్గొన్నారు. యిమ్మడి అంజనీదేవి బృందం గురు వందనంలో భాగంగా భక్తిమాల కీర్తనలు పుస్తకరూపం అలాగే సీ.డి. రూపంలో తమను ప్రోత్సహించిన అతిథులను ఘనంగా సన్మానించారు. అతిథులు యిమ్మడి అంజనీదేవి బృందం సంగీతానికి చేస్తున్న కృషిని కొనియాడారు. కార్యక్రమాలను యిమ్మడి మల్లికార్జునరావు పర్యవేక్షించారు.





కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి