‘గుంటూరు తిరుమల’లో వేంచేసి యున్న బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం పద్మావతి కళ్యాణవేదికపై 03.10.2024 గురువారం శ్రీ దేవీ శరన్నవరాత్రుల మహోత్సవములలో భాగంగా ఉదయం అమ్మవారు బాలాత్రిపురసుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య కళావేదికగా నాగార్జున సాంస్కృతిక కేంద్రం మరియు తిరుమల తిరుపతి దేవస్థాన అన్నమయ్య ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అన్నమాచార్య కీర్తనల గానం జరిగింది. తిరుమల గానగంధర్వ గురజాడ మధుసూదనరావు గారు అన్నమయ్య కీర్తనలు అద్భుతంగా గానం చేసి ఆహుతులను అలరించారు. వీరికి కీబోర్డుపై మురళీకృష్ణ, తబలపై దేవశర్మ, రిథమ్స్‌పై శ్రీనివాస్ చక్కటి వాయిద్య సహకారాన్ని అందించారు. నవరాత్రులలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సత్సంగ సభ్యులచే లలితా సహస్రనామ పారాయణాలు జరుగుతాయని ఆలయ పాలకమండలి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య తెలియజేశారు. అమ్మవారికి హారతి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందించారు. కె. సూర్యనారాయణ గారి నిర్వహణలో కార్యక్రమం జరిగింది.
ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై శనివారం కూచిపూడి నృత్యప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలుత నూజివీడు సీడ్స్ చైర్మన్ కారుమంచి ప్రసాద్, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కుమారి చదలవాడ వేంకట రమణి, నాట్యకిరణం కూడిపూడి నృత్య అకాడమి హైదరాబాద్ నాట్యాచారిణి మిద్దె కిరణ్మయి మరియు బృందం కూచిపూడి నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని కీ.శే. శ్రీమతి చదలవాడ శారద సత్యనారాయణ జ్ఞాపకార్ధం కార్యక్రమాన్ని చదలవాడ వేంకట రమణి నిర్వహించారు.







కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి