ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

సెప్టెంబర్, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

కళా దర్బార్ ఉగాది పురస్కారాల ప్రదానం - 31.03.2025

కళా దర్బార్ ఉగాది పురస్కారాల ప్రదానం బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై కళాదర్బార్-ఆంధ్రప్రదేశ్ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పురస్కారాల ప్రదానం సోమవారం రాత్రి జరిగింది. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పొత్తూరి రంగారావు ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించారు. తొలుత ఆలయ పాలకమండలి కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి ఊటుకూరు నాగేశ్వరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అనురాధ అయ్యంగారి(టీవీ రంగం), డాక్టర్ జి. నాగార్జున (వైద్యం), కనుమూర్ రాజ్యలక్ష్మి (విద్య), శనివారపు శిరీష (సంగీతం), చెన్నుపాటి శివనాగేశ్వర రావు(వ్యాపారం), సాయి లక్కరాజు(కళారంగం)లకు ఉగాది పురస్కారాలు అందించి సత్కరించారు. అనంతరం సినీ సంగీత విభావరి నిర్వహించారు. హేమమాలిని, సౌజన్య, బాబూరావు, సుధీర్ బాబు, అబ్దుల్ ఖాదర్ సినీ గీతాలను ఆలపించారు.
  స్థానిక బృందావన గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శ్రీ కే.ఆర్.కే.ఎం. మెమోరియల్ అకాడమీ అఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో 15.09.2024 ఆదివారం అమరావతి నాట్యోత్సవాలలో భాగంగా   నాట్యాచారిణి కోకా విజయలక్ష్మి శిష్య బృందం పలుకీర్తనలకు కూచిపూడి నృత్యాన్ని , ప్రముఖ నాట్యచారి సత్యనారాయణరాజు   రామ కథ లోని ప్రధాన ఘట్టాలను భరతనాట్యాన్ని ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
  ‘గుంటూరు తిరుమల’లో వేంచేసి యున్న  శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై 2024 సెప్టెంబరు నెల జరుగు కార్యక్రమములు
  స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటి ఆధ్వర్యంలో వినాయకచవితి వేడుకలు ఘనంగా జరిగాయి. బృందావన్ గార్డెన్స్ ధార్మిక ప్రాంగణంలో గణేష్ ఉత్సవమండలి నిర్వహణలో బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతుల ఆధ్వర్యంలో చవితి వేడుకలు ఘనంగా జరిగాయి.